పోలీసులు మాచర్ల నియోజకవర్గంలో అరాచక శక్తులకు కొమ్ముకాస్తూ తెదేపా నాయకులను వేధింపులకు గురి చేస్తున్నారని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వెల్దుర్తి మండలం బోదిలవీడులో దాడికి గురైన తెదేపా సానుభూతిపరుడు మామిళ్లపల్లి కోటయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మాట్లాడారు.