వినుకొండ వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు వ్యతిరేకంగా వినుకొండ పట్టణంలో గోడప్రతులు అంటించడం చర్చనీయాశంగా మారింది. జగనన్న ముద్దు- ఈ ఎమ్మెల్యే మాకొద్దు నినాదంతో వినుకొండ నియోజకవర్గ ప్రజలు పేరుతో శనివారం ఉదయం వివిధ కూడళల్లో ఇవి కనిపించాయి. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో అధికార పార్టీ నేతలు వీటిపై ఆరా తీశారు. పురపాలక సంఘ కమిషనర్ వెంకయ్య పారిశుద్ధ్య సిబ్బందిని పంపి. వాటిని తొలగించారు.