వైఎస్సార్ 2004లో అధికారంలోకి రాగానే మాచర్ల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఫ్యాక్షనిజం, నక్సలిజం పీచమణిచారు. సాగు, తాగునీ టి వనరుల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. కొప్పునూరు, అనుపు లిఫ్ట్ ఇరిగేషన్కు చింతలతండాలో రూ. 100 కోట్లు కేటాయించి 10వేల ఎకరాలకు సాగు, తాగునీరిచ్చేలా చర్య లు తీసుకున్నారు. ప్రతి మండలంలో పీహెచ్సీలు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందుబాటులోకి శనివారం తెచ్చారు.