ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయాలతో పిల్లల చదువులు అటకెక్కుతున్నాయని రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆదివారం రేపల్లెలో ఆయన మాట్లాడుతూ యాప్స్ అప్లోడ్ పేరుతో పిల్లలకు పాఠాలు చెప్పనివ్వకుండా ఉపాధ్యాయుల సమయాన్ని ప్రభుత్వం వృధా చేస్తుందన్నారు. విద్యా బోధన నిర్వీర్యం చేస్తున్న యాప్ లను ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. అవసరం లేని పనులు టీచర్లకు అప్పగించి అదనపు పని భారం మోపటం తగదన్నారు.