తమ ఆధీనంలో ఉన్న ఉద్యోగులు, పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. వారికి ప్రస్తుతం 42 శాతంగా ఉన్న డీఏను 45 శాతానికి పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా రూపొందించిన నివేదికను ప్రతి నెలా లేబర్ బ్యూరో కేంద్రానికి అందిస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని కేంద్రం డీఏను పెంచనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.