రాజంపేటలోని బిజెపి కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు అన్నిటిని స్వాహా చేస్తూ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్న సందర్భంగా దానికి నిరసనగా బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈనెల 10వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇన్చార్జి పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు.