అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం కోసం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి 400 కేజీల బరువైన తాళంను తయారు చేసి ఇచ్చారు. అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్ శర్మ తాళాలు తయారు చేస్తుంటారు. రాముడి భక్తుడు కావడంతో సత్యప్రకాశ్ శర్మ రూ.2 లక్షలు వెచ్చించి ప్రపంచంలోనే అతి పెద్ద తాళంను తయారు చేశాడు. ఇది 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అడుగుల మందంతో తాళాన్ని తయారు చేశారు.