తాను శివుడి అవతారమని చెప్పిన ఓ వ్యక్తి వృద్ధురాలపై దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లా గోగుండా తహసీల్ పరిధిలో చోటు చేసుకుది. మద్యం తాగిన ప్రతాప్‌సింగ్ (70) తాను శివుడి అవతారమని ఊగిపోయాడు. ఆమెకు ఎదురుగా కనిపించి కల్కిబాయ్ గమేతి (85) అనే వృద్ధురాలిని నిన్ను చంపి మళ్లీ బతికిస్తానని ఆమె ఛాతీపై పిడిగుద్దులు గుడ్డాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆదివాసీలు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.