గుంటూరు నగరం వేళంగిణినగర్ కు చెందిన జయశ్రీ (65) ఆదివారం స్నానం గదిలో పడి మృతి చెందారు. స్నానం చేసేందుకు వెళ్లిన జయశ్రీ ఎంతసేపటికి రాకపోవడంతో ఆమె కుమార్తె చంద్రిక తన సోదరుడు రమేష్ కు విషయం చెప్పింది. ఆయన తలుపులు పగులగొట్టి చూడగా తల్లి జయశ్రీ కింద పడిపోయి ఉంది. ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.