గుంటూరు జిల్లా పొన్నూరు మండలం తహసిల్దార్ కార్యాలయంలో నేడు సోమవారం యధావిధిగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల తహసిల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని ప్రజలు సమస్యలను స్పందన కార్యక్రమంలో అర్జీల రూపంలో అందించాలని ఆయన కోరారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు స్పందన కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.