ప్రొద్దుటూరు కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లె గ్రామంలో ఆదివారం రూ. 12 లక్షలతో క్రిస్టియన్ శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణ పనులను సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లె-మీనాపురం గ్రామాల మధ్యలో ఉన్న శ్మశాన వాటిక అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ప్రహరీ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటరంగయ్య, సుబ్బయ్య పాల్గొన్నారు.