మణిపుర్ లో జరిగిన మారణకాండపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని హోసన్న మినిస్ట్రీస్ అధినేత బ్రదర్ అబ్రహం కోరారు. మణిపుర్ లో మహిళలపై జరిపిన దాడులు, మారణకాండను నిరసిస్తూ గుంటూరు నగరంలోని హోసన్న, కృపా మినిస్ట్రీస్, ఏఈఎల్సీ, ఇతర క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ముందుగా గుంటూరు నగరం లాడ్జి కూడలి నుంచి నగరంపాలెం వరకు ప్రదర్శన నిర్వహించారు.