కార్పొరేషన్ స్థలంలో ప్రహరీని ఓ నిర్మాణ సంస్థ నిర్వాహకులు పగులగొట్టిన ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు నగరం కృష్ణానగర్‌లోని కార్పొరేషన్ కు చెందిన స్థలం పక్కనే నిర్మాణ పనులు చేపట్టి ఓ సంస్థ నిర్వాహకులు ఆదివారం గోడను పగులగొట్టారు. సిటీప్లానర్ ప్రదీప్ కుమార్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.