గుంటూరు పట్టణంలోని శారదా కాలనీ, 8వ లైన్ కు చెందిన కనుకూరి సంజయ్ కుమార్ అమరావతి రోడ్లోని సెంటెన్స్ స్కూల్ నందు 9వ తరగతి చదువుతున్నాడు. ఇతను ఇంట్లో గొడవల కారణంగా ఈ నెల 6వ తేదీ ఇంటిలో నుంచి వెళ్లిపోయాడు. బంధువులు ఇంట్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆదివారం అరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa