కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పార్లమెంటు పునరుద్ధరించింది. మోదీ ఇంటిపేరుపై రాహుల్ వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసులో రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పార్లమెంటు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ మళ్లీ ఎంపీగా మారారు.