అమెరికా అంతరిక్ష పశోధనా సంస్థ నాసా 46 ఏళ్ల క్రితం ప్రయోగించిన వోయేజర్–2 వ్యోమనౌక మళ్లీ యథాతథంగా పనిచేయడం ప్రారంభించింది. కమ్యూనికేషన్ వ్యవస్థలో చోటుచేసుకున్న పొరపాటు వల్ల జూన్ 21వ తేదీన వోయేజర్–2 నుంచి భూమికి సంకేతాలు ఆగిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన నాసా సైంటిస్టులు వోయేజర్–2ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. ఇతర గ్రహాలపై పరిశోధనల కోసం దీన్ని అంతరిక్షంలోకి పంపించారు.