వైవీయూ విసి ఆచార్య చింతా సుధాకర్ డిగ్రీ సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైవియూలో కంప్యూటర్స్ , వృక్ష శాస్త్రం, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, బయోటెక్నాలజీ పేపర్లను అధ్యాపకులు మూల్యాంకనం చేస్తున్నారు. విసి ఆచార్య చింత సుధాకర్ మూల్యాంకన కేంద్రానికి ఉన్నఫలంగా వచ్చారు. సమాధాన పత్రాలను పరిశీలించారు. అసౌకర్యాలు ఏమైనా ఉన్నాయా అంటూ అధ్యాపకులు అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa