దేశంలో పులుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం వాటి సంఖ్య పెరిగిందని కేంద్రం తెలిపింది. 2006లో 1,411 పులులు ఉండగా, 2022 నాటికి ఈ సంఖ్య 3,682కు పెరిగిందని వెల్లడించింది. పులుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఈ మేరకు సోమవారం పార్లమెంట్‌కు సమాచారం అందించింది.