భారతీయ రైల్వేలో దాదాపు 2.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందులో ఎక్కువ శాతం ‘గ్రూప్ సీ’ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వివరాలను వెల్లడించింది. రైల్వేలోని అన్ని జోన్లలో గ్రూప్ సీ పోస్టుల్లో మొత్తం 2,48,895 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. గ్రూప్ ఏ, బీలలో మొత్తం 2,070 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మొత్తం ఖాళీల సంఖ్య 2,50,965గా ఉందని పేర్కొంది.