ఇన్స్టాగ్రామ్లో ప్రేమించుకున్న ఓ జంట పెళ్లి కోసం కిడ్నాప్ డ్రామా ఆడారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటు చేసుకుంది. హన్సిక వర్మ అనే యువతికి ఇన్స్టాగ్రామ్లో రాజ్సింగ్ పరిచయమయ్యాడు. పెళ్లికి చేసుకోవాలనుకున్న వీరికి డబ్బులు కావాల్సి వచ్చింది. దాంతో ఇద్దరూ కలిసి కిడ్నాప్ డ్రామా ఆడారు. హన్సిక కిడ్నాప్ వీడియోను ఆమె తండ్రికి పంపి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. దాంతో హన్సిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు రాజ్సింగ్ను అదుపులోకి తీసుకున్నారు.