నకిలీ ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లుగా నటిస్తున్న ఓ జంటను జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి లక్షల రూపాయలు కాజేశారు. వీరిపై శ్రీనగర్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు. మన్మోహన్ గంజా, భార్ ఆయూష్ కౌల్గా గుర్తించారు. మన్మోహన్ గంజూ సస్పెండ్ అయిన పోలీస్. వీరి వద్ద నుంచి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, నగదు, నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు స్వాధీనం చేసుకున్నారు.