జమ్మూకశ్మీర్‌ను మరోసారి భూకంపం వణికించింది. మంగళవారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం వచ్చింది. రిక్టార్ స్కేల్ మీద దీని తీవ్రత 37గా నమోదైంది. ఈరోజు తెల్లవారుజాము 12.04 గంటలకు ధోడా ప్రాంతానికి ఆగ్నేయంగా ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ తెలిపింది. భూమి ఉపరితలానికి 5 కిలో మీటర్ల లోతున భూకంపం సంభవించిందని వెల్లడించింది. ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.