భారీ వర్షాలు, వరదలు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు చైనాలో వరదల కారణంగా 30 మంది మృతి చెందినట్టు అధికారులు తాజాగా ప్రకటించారు. జిలిన్ ప్రావిన్స్‌లోని షులాన్ నగరంలో ఒక్క ఆదివారమే 14 మంది మృతి చెందారని తెలిపారు. ప్రావిన్స్ రాజధాని హార్బిన్లో దాదాపు 1.6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు ప్రకటించారు. అలాగే లక్షల హెక్టార్లలో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.