నేపాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదల కారణంగా భాగమతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉండి, కుపొండోల్, ఖోకానో తదితర ప్రాంతాలు నీట మునిగాయి. అయితే ప్రస్తుతం రుతుపవనాల ప్రభావం చురుకుగా ఉంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.