ఐఏఎస్ అవ్వాలనే కల నెరవేరకపోవడంతో ఓ బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని మండ్య నగరంలో చోటు చేసుకుంది. కావేరి గ్రామీణ బ్యాంకు ప్రాదేశిక కార్యాలయంలో శ్రుతి (30) మేనేజర్‌గా పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలని కలలు కనేది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో బ్యాంక్‌లో ఉద్యోగం సంపాదించుకుంది. కానీ తన కల సాకారం కాలేదు. దాంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. మండ్య పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.