జైలు గోడ దూకి ఓ నేపాలీ యువతి పారిపోయింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. నేపాల్‌లోని దుమరింగ్ గ్రామానికి చెందిన అనుష్క ఉరఫ్ ఆకృతి (25)ని రెండున్నరేళ్ల క్రితం ధార్చులాలో మాదకద్రవ్యం తరలిస్తుండగా పట్టుబడింది. ఆమెను పిథోర్‌గఢ్ జిల్లా జైలులో శిక్షను అనుభవిస్తుంది. ఈ క్రమంలో దుస్తువులతో తాడు తయారు చేసి గోడ దూకి యువతి పారిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఆమె ఆచూకీ చెప్పిన వాళ్లకు రూ.10 వేలు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.