ప్రత్యామ్నయ పంట సాగుచేసుకునే రైతులకు ఉలవలు అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన రైతులు తమ పేర్లు నమోదుచేసుకోవాలని మండల వ్యవసాయశాఖ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా ఆర్బీకేల వద్ద పేరు నమోదు చేసుకొని ఉలవ పంట సాగుచేస్తామని దృవీకరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పంట సాగుచేయని వారికి ఇన్సూరెన్స్ నిలిపివేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.