రాజాం పట్టణంలోని ఎస్సీ గెడ్డ వీధికి చెందిన 50 మంది వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో సోమవారం చేరారు. మాజీ మంత్రి, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కొండ్రు మురళీమోహన్ తెలుగుదేశం పార్టీలోకి వీరిని సాధారణంగా ఆహ్వానించి పార్టీ కండువలు కప్పారు. వైసిపి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని ప్రజల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు. సీఎం తన అనాలోచిత నిర్ణయాలతో నియంత పాలనను కొనసాగిస్తున్నారన్నారు.