మధ్యప్రదేశ్లోని రెవా జిల్లాలో ఇద్దరు మైనర్లపై సామూహిక అత్యాచారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీడియో ఆధారంగా ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. హనుమానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ అత్యాచారం జరిగింది. మేకలు మేపేందుకు వెళ్లిన ఇద్దరు మైనర్లపై గ్యాంగ్ రేప్ జరిగిందని పోలీసులు తెలిపారు.