తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న అటాక్ జైలులో ఆయనను ఉంచారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ఉంటున్న జైలులో నల్లులు, కీటకాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఇమ్రాన్ ఖాన్‌కు సీ క్లాస్ సదుపాయాన్ని కల్పించినట్లు అటార్నీ నయీమ్ హైదర్ పంజోతా తెలిపారు.