టీడీపీ అగ్రనేత నారా లోకేష్ పై మాచర్ల ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ నువ్వు మగాడైతే, నువ్వు చంద్రబాబుకే పుట్టి ఉంటే నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలని అన్నారు. నేను వెయ్యి కోట్ల అవినీతి చేసి ఉంటే నిరూపించు అని సవాల్ విసిరారు. నన్ను ఏదో చేయాలి అనుకున్న మీ అయ్య వల్లే కాలేదు.. నీ వల్ల ఏమౌతుంది. లోకేష్ నీవు పప్పు కాదు.. వెర్రి పుష్పానివి అంటూ చురకలు అంటించారు.