జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న మూడో విడత వారాహి యాత్రను విజయవంతం చేయాలని జనసేన పార్టీ దివ్యాంగుల నాయకుడు గోగణ ఆదిశేషు తెలిపారు. మంగళవారం బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. ఈ నెల 10 నుంచి విశాఖపట్నం నగరంలో వారాహి యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడగలిగిన దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని ప్రజలందరూ తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలన్నారు.