రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై పోరుబాట పట్టాలని, ఈనెల 10న కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ నాయకులకి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామ పంచాయతీల నిధులను స్వాహా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. పంచాయితీల నిధులను స్వాహాచేస్తే గ్రామాలు ఎలా అభివృద్ది చెందుతాయని ప్రశ్నించారు. కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులకు మోకాలొడ్డుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల గ్రామ పంచాయితీల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్ధితులు ఏర్పడుతున్నాయన్నారు.