నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లోని ప్రాజెక్టుల స్థితిగతులపై టీడీపీ అధినేత చంద్రబాబు పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..... పోలవరం నిర్వాసితులకు నాలుగేళ్లలో ఏ ఒక్కరికీ పరిహారం ఇవ్వకుండా లబ్ధిదారుల జాబితా మార్చి సీఎం జగన్ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిధిలో కొత్తగా ఒక్క కట్టడమూ జగన్ చేపట్టలేదని, ఇంకా 214 కట్టడాలు కట్టాల్సి ఉండగా, 50 శాతం కనెక్టివిటీ పనులు పెండింగ్లోనే ఉన్నాయని చంద్రబాబు అన్నారు. మూర్ఖుడి దగ్గర అధికారం ఉంటే, రాష్ట్రానికి ఎంత నష్టమో పోలవరం విధ్వంసం ఓ ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు.