నేడు మంత్రి బొత్స సత్యనారాయణతో 12 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సమావేశం అయ్యారు. అలాగే పదోన్నతి, బదిలీలు పొందిన ఉపాధ్యాయుల సవరించిన కేడర్ వివరాలు ఆమోదించాలని, బకాయి ఉన్న జూన్, జూలై వేతనాలు చెల్లించాలంటూ ఈ అంశాలపై మంత్రితో ఉపాధ్యాయ సంఘాల నాయకులు చర్చినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలని.. కస్తూర్భా పాఠశాల ఒప్పంద ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేలు అమలు చేయాలి, అలాగే వారిని క్రమబద్ధీకరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.