బైపాస్ సర్జరీ అంటే గుండెకు సంబంధించి చేసే ఆపరేషన్. అయితే ఓ వ్యక్తికి ఏకంగా 3 సార్లు ఈ బైపాస్ సర్జరీ చేశారు. అయితే ఈ బైపాస్ సర్జరీ చేసిన తర్వాత చాలా మంది కొన్ని రోజుల తర్వాత చనిపోతూ ఉంటారు. అయితే కొంత మంది మాత్రం సుదీర్ఘ కాలం జీవిస్తూ ఉంటారు. అయితే 3 బైపాస్ సర్జరీలు అయిన ఓ వ్యక్తి చాలా కాలంగా ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో పాటు గుండెకు మూడు సార్లు బైపాస్ సర్జరీలు చేయించుకున్న తర్వాత అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఆయనకు తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఆయనే బ్రిటన్‌కు చెందిన 77 ఏళ్ల కోలిన్ హాంకాక్. గతంలో ఓ వ్యక్తి పేరు మీద ఉన్న రికార్డును కోలిన్ హాంకాక్ బద్దలు కొట్టాడు.
బ్రిటన్‌కు చెందిన కోలిన్ హాంకాక్.. వంశంలో అందరికీ ఓ సమస్య ఉంది. దీంతో అది ఆయనకు కూడా వచ్చింది. ఇలా వంశపారంపర్యంగా సంక్రమించే హైపర్ కొలెస్టెరోలేమియా అనే వ్యాధితో కోలిన్ హాంకాక్ తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ హైపర్ కొలెస్టెరోలేమియా అనే సమస్య కారణంగా.. శరీరంలోని కొవ్వులు పెరగడంతో పాటు కరోనరీ హార్ట్ డిసీజ్‌కు దారి తీస్తుంది. ఈ హైపర్ కొలెస్టెరోలేమియా వల్ల.. కోలిన్ హాంకాక్‌కు 30 ఏళ్ల వయసు ఉన్నపుడు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించి డాక్టర్లు చికిత్స అందించారు.
దీంతో కోలిన్ హాంకాక్‌కు.. ఆ తర్వాతి సంవత్సరంలో మూడు సార్లు బైపాస్ సర్జరీలు చేశారు. అయితే ప్రస్తుతం కోలిన్ హాంకాక్ వయసు 77 ఏళ్లు. దీంతో కోలిన్ హాంకాక్ ఈ 3 బైపాస్ సర్జరీలు చేయించుకుని 45 సంవత్సరాల 361 రోజులు పూర్తయింది. అయితే ఈ సుదీర్ఘ కాలంలో ఆయనకు మరో బైపాస్ సర్జరీ జరగక పోవడం గమనార్హం. అయితే ఇప్పటికీ కోలిన్ హాంకాక్ ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలోనే 3 బైపాస్ సర్జరీలు చేసుకున్న తర్వాత అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా కోలిన్ హాంకాక్ తాజాగా చరిత్ర సృష్టించారు. దీంతోనే ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కింది. గతంలో ఇలా మూడు బైపాస్ సర్జరీలు చేయించుకుని.. ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా.. అమెరికాకు చెందిన డెల్బర్ట్ డేల్ మెక్‌బీ పేరిట ఈ రికార్డు ఉండేది. ట్రిపుల్ బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత.. డెల్బర్ట్ డేల్ మెక్‌బీ 41 ఏళ్ల 63 రోజులు ప్రాణాలతో జీవించారు. 2015 లో 90 ఏళ్ల వయసులో డెల్బర్ట్ డేల్ మెక్‌బీ చనిపోయారు. తాజాగా డెల్బర్ట్ డేల్ మెక్‌బీ రికార్డును బద్దలు కొట్టిన కోలిన్ హాంకాక్.. ట్రిపుల్ బైపాస్ సర్జరీ చేయించుకుని.. అత్యధిక కాలం బతికి ఉన్న వ్యక్తిగా రికార్డు సాధించారు.
అయితే యువకుడిగా ఉన్నపుడు తనకు హార్ట్ ఎటాక్ వచ్చేవరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని కోలిన్ హాంకాక్ వెల్లడించాడు. తనకు 30 ఏళ్ల వయసులో తాను చాలా ఆటలు ఆడేవాడినని.. అప్పుడు తనకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు ఎలాంటి లక్షణాలు కూడా బయటపడలేదని కోలిన్ హాంకాక్ చెప్పాడు. అయితే తాను బాల్యంలో ఆరోగ్యం కోసం పౌష్టికాహారం కూడా తీసుకోలేదని తెలిపాడు. చిన్నప్పుడు గుడ్లు, చిప్స్ ఇష్టంగా తినేవాడిని వివరించాడు. తనకు ఇలా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.