ఏపీలోని విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మర్రిపాలెం ప్రకాశ్ నగర్‌లో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి అపార్టుమెంటు నీటిసంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతులను వాచ్‌మెన్ భార్య సంధ్య, పిల్లలు అలేఖ్య, గౌతమ్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఎయిర్‌పోర్టు జోన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.