ఏపీలోని విశాఖపట్నంలో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. షీలానగర్ వద్ద గూడ్స్ రైళ్లు ఎక్కువగా ప్రయాణించే లూప్‌లైన్‌లోని రైల్వే ట్రాక్‌పై ఓ కారు ఆగిపోయింది. అదే సమయంలో అటుగా గూడ్స్ ట్రైన్ వచ్చింది. కారును గమనించి గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ వేగాన్ని తగ్గించాడు. దీంతో కారును స్లోగా గూడ్స్ ట్రైన్ ఢీకొట్టి ఆగిపోయింది. కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.