దేశవిభజన సమయంలో విడిపోయిన అన్న, చెల్లి 76 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. పాక్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో వీరు ఇటీవల కలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు. పాకిస్థాన్ యూట్యూబర్ నాసిర్ ధిల్లాన్ ప్రసారం చేసిన ఓ వీడియోలో పాక్ మహిళ సకీనా బీ తన అన్న గుర్మైల్ సింగ్ గ్రేవాల్ భారత్‌లోని పంజాబ్‌లో ఉన్నట్లు చెప్పింది. ఈ వీడియో చూసిన గుర్మైల్ కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా పాక్‌కు వెళ్లి సోదరిని కలిశాడు.