పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ బుధవారం రద్దు కానుంది. ప్రధాని పదవికి షెహబాజ్ షరీఫ్ రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌కు షెహబాజ్ వీడ్కోలు పలికారు. వాస్తవానికి పాక్ పార్లమెంట్ ఐదేళ్ల కాలం ఈ నెల 12తో పూర్తి అవుతుంది. దానికి నాలుగు రోజులు ముందుగానే నేషనల్ అసెంబ్లీ రద్దుకు సంకీర్ణ ప్రభుత్వం సిద్ధమైంది. 60 రోజుల్లో పాక్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.