మణిపూర్ లో హింసను నిరసిస్తూ వినుకొండ పట్టణంలో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్ స్పీ కాలనీ నుంచి ర్యాలీ గా నినాదాలు చేస్తూ స్తూపం కూడలిలో చేరి, అక్కడ శాంతి ప్రార్థనాలు చేసారు. మణిపూర్ లో ప్రార్థన స్థలాల పై దాడులు, మహిళల పై జరుగుతున్నా ఆకృత్యలను అరికట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.