పెంచిన విద్యుత్ చార్జీలను వ్యతిరేఖస్తూ తెదేపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సూచనలు మేరకు పొన్నూరు పట్టణ, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నేడు బుధవారం సాయంత్రం 5. 30 గం. పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుండి గాంధీ బోమ్మ సెంటర్ వరకు కొవ్వొత్తుల నిరసన ర్యాలీ జరప తలపెట్టినట్లు పొన్నూరు తెదేపా పార్టీ కార్యాలయ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.