వినుకొండ మండలంలోని దొండపాడు, హస్సానాయునిపాలెం పంచాయతీల్లో ఖాళీగా ఉన్న వార్డులకు ఎన్నికల ప్రకటన విడుదల చేసినట్లు రిటర్నింగ్ అధికారి సుందరరెడ్డి బుధవారం తెలిపారు. 2 పంచాయతీల్లో ఒక్కొక్క వార్డు చొప్పున ఖాళీలు ఉన్నాయన్నారు. దొండపాడులో 5వ వార్డు (ఎస్సీ జనరల్), హస్సానాయునిపాలెం 6వ వార్డు (బీసీ మహిళ)కు కేటాయించినట్లు చెప్పారు. వినుకొండ మండల పరిషత్ కార్యాలయంలో 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa