ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుంగనూరు ఘటనపై జనసేన ఎందుకు మాట్లాడటం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 02:00 PM

పుంగనూరు అల్లర్లకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి  సీదిరి అప్పలరాజు విమ‌ర్శించారు. నేడు అయన మీడియా తో మాట్లాడుతూ....  మూడు రోజుల క్రితం చంద్రబాబు కర్త,కర్మ, క్రియగా వ్యవహరించి జరిగిన అమానుషంపై జనసేన ఎందుకు వీళ్లు మాట్లాడటం లేదు..?  అంగళ్లులో ఎలా వాళ్ల మనుషులను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడో రాష్ట్ర ప్రజలంతా చూశారు. అక్కడి పోలీసులు పాటించిన సంయమనానికి సెల్యూట్ చేయాలి.  ప్రాణాపాయం ఎవరికీ కలుగలేదు కానీ..చంద్రబాబు కుట్రలను సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతే మాస్ కిల్లింగ్స్ జరిగి ఉండేవి. 40 మంది పోలీసులు నెత్తురోడుతూ శాంతిభద్రతలను కాపాడారు. ఈ వార్త కనీసం రామోజీరావు, రాధాక్రిష్ణ, టీవీ5 నాయుడులు ఒక్క చోటైనా ప్రచురించారా..? అని ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com