ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైయస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా విడుదల చేసిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 02:02 PM

ఈఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ త్రైమాసికానికి సంబంధించి వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్లను సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. వధువుల తల్లుల బ్యాంక్‌ ఖాతాల్లో వైయస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా సాయం జమ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... పేద తల్లిదండ్రులందరూ తమ పిల్లలను గొప్పగా చదివించి, వారి పెళ్లి కూడా గౌరవప్రదంగా, అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా చేయాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు, ఆశిస్తారు. నిజంగా పేదరికంలో ఉన్న అటువంటివారందరికీ కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా దివ్యాంగులు, నా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లల కోసం ఈ పథకం తెచ్చాం. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, అప్పులపాలయ్యే పరిస్థితి లేకుండా, రాకుండా పెళ్లీళ్లు జరిగే పరిస్థితి రావాలని, ఆ పిల్లలు బాగా చదవాలని, ప్రతి ఒక్కరూ డిగ్రీ వరకు వెళ్లే పరిస్థితికి రావాలనే తలంపుతో ఈ కార్యక్రమం చేస్తున్నాం అని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa