విద్యుత్ ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. విద్యుత్ జేఏసీ 15 శాతం ఫిట్‌మెంట్ డిమాండ్ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 9 శాతం ఇచ్చేందుకు అంగీకరించింది. ఇందుకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కూడా అంగీకరించడంతో.. యాజమాన్యంతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మాస్టర్ స్కేల్ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు సబ్ కమిటీ ఆమోదించింది. దీంతో సమ్మె నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa