అమెరికా ఫ్లోరిడాలోని మెగా మిలియన్స్ లాటరీలో ఓ వ్యక్తి 1.58 బిలియన్ డాలర్ల (రూ.13 వేల కోట్లు) జాక్‌పాట్ కొట్టారు. నెఫ్యూన్ బీచ్‌లోని పబ్లిక్స్ స్టోర్ విక్రేత ఈ టికెట్‌ను విక్రయించగా, నిర్వాహకులు మంగళవారం డ్రా తీశారు. అమెరికా చరిత్రలో మూడో అతి పెద్ద లాటరీ ప్రైజ్‌మనీ ఇదేనని సమాచారం. డ్రాలో గెలుపొందిన వ్యక్తికి ఈ 1.58 బిలియన్ డాలర్ల నగదును ఏడాదికి కొంత మొత్తం చొప్పున 30 ఏళ్ల పాటు చెల్లిస్తారు.