రాష్ట్రంలో ఆసరా పింఛన్లు కింద రూ.10 వేల లబ్ధి పొందుతున్న వారికి ఉచిత బస్ పాసులు అందించాలని సీఎం ఆదేశించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. దీని వల్ల సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా రోగులకు ప్రయోజనం ఉంటుందని అన్నారు. అలాగే, ఆరోగ్య శ్రీ పరిధిలోని అన్ని క్యాన్సర్ ఆస్పత్రుల్లో పాలియేటివ్ కేర్ కోసం 5 శాతం పడకలను కచ్చితంగా కేటాయించాలని అధికారులను ఆదేశించారు.