అత్యాచారం కేసుల్లో ఇరుక్కున్న నిందితుల విషయంలో న్యాయస్థానం కడు జాగ్రత్తగా పరిశీలించి నిజాన్ని నిగ్గు తేల్చాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. అత్యాచార బాధితురాలికి ఎంత వేదన ఉంటుందో, అసత్య ఆరోపణలతో అలాంటి కేసుల్లో ఇరుక్కునే నిందితుల పరిస్థితి కూడా అలాగే ఉంటుందని పేర్కొంది. ఎఫ్ఐఆర్ పూర్తిగా పరిశీలించాలని తెలిపింది. యూపీకి చెందిన ఓ రౌడీ షీటర్ పై అత్యాచార కేసు కొట్టేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం రద్దు చేసింది.