ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ హయాంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే మండలానికి ఒక వర్క్ స్టేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని స్పష్టం చేశారు. సోలార్ పవర్ తీసుకొచ్చి రూ.2కే యూనిట్ కరెంట్ ఇస్తామన్నారు. మన్యం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని తెలిపారు.